News April 29, 2024
అరగంట కరెంట్ కట్.. అధికారి సస్పెన్షన్

TG: ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో హబ్సిగూడ సర్కిల్ కీసర DE సస్పెన్షన్‌కు గురయ్యారు. అలాగే నాగారం AEEపై చర్యలకు TSSPDCL సీఎండీ ఆదేశించారు. SE అనుమతి లేకుండా శనివారం ఉదయం కరెంట్ తీయగా.. ఆ సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి నాగారంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీంతో కరెంట్ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం చర్యలు తీసుకుంది.
Similar News
News February 8, 2026
ఈవారం మూడు IPOలు.. ₹3,871 కోట్ల సమీకరణ

ఈవారం ఇన్వెస్టర్లకు 3 IPOలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ₹3,871 కోట్లు సమీకరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఫ్రాక్టల్ అనలిటిక్స్ (₹2,834 కోట్లు), NBFC Aye Finance (₹1,010 కోట్లు) IPOలు ఫిబ్రవరి 9న ప్రారంభమై 11న ముగియనున్నాయి. వీటితో పాటు SME విభాగంలో మరుషిక టెక్నాలజీ IPO ఫిబ్రవరి 12న మొదలవుతుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఇవి భారీగా నిధులు సేకరించాయి.
News February 8, 2026
T20 WC: అఫ్గాన్‌ను ఓడించిన న్యూజిలాండ్

చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. సీఫర్ట్ 65, ఫిలిప్స్ 42, చాప్‌మాన్ 28, మిచెల్ 25*, శాంట్నర్ 17* రన్స్ చేశారు. ఫిన్ అలెన్ (1), రచిన్ రవీంద్ర (0) నిరాశపరిచారు. టీ20 WC చరిత్రలో న్యూజిలాండ్‌కు ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ కావడం గమనార్హం.
News February 8, 2026
జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం

BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ MLC కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించింది. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేసిన కవిత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.


