News February 5, 2026

క‌ష్ణాజిల్లాలో 6 బార్ల ఎంపిక

image

జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన బార్ లైసెన్సుల కోసం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మచిలీపట్నం లాటరీ విధానాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్లలో 6 బార్లకు 37 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం లాటరీ విధానం ద్వారా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 5 బార్లు, గుడివాడ మున్సిపాలిటీలో 1 బారుకు లైసెన్సులు మంజూరు చేశారు. గుడివాడలో 4, పెడనలో 1 బార్‌కు దరఖాస్తులు లేకపోవడంతో వాటి లాటరీని రద్దు చేశారు.

Similar News

News February 13, 2026

కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.

News February 13, 2026

కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

image

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.

News February 13, 2026

కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

image

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.