News February 5, 2026

కాంగ్రెస్‌కు విజన్ లేదు.. ప్లాన్ లేదు: మోదీ

image

గత పాలకులు చేసిన తప్పులను సరిచేయడంపై తాము దృష్టి పెట్టామని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు ఐడియా, విజన్, ప్లాన్ లేవని విమర్శించారు. గతంలో ఏదైనా ఒప్పందం గురించి మాట్లాడితే.. ప్రజలు బోఫోర్స్ గురించే ప్రస్తావించే వారని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కీలక సంస్థలను బలహీనపరిచాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లు దేశం బాధపడాల్సి వచ్చిందని అన్నారు.

Similar News

News February 25, 2026

‘మీ టికెట్’తో ఆర్టీసీ సహా పలు సేవలు

image

TG: రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని టికెట్లు ఒకేచోట బుక్ చేసుకొనేలా ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. RTC, మెట్రో రైలు టికెట్లు, పాసులు, దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఫారెస్టు సఫారీ, హైదరాబాద్‌లోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, EV ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి టికెట్లను ముందే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా పొందొచ్చు.

News February 25, 2026

పసుపు పంటలో దుంప తొలుచు ఈగ – నివారణ

image

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.

News February 25, 2026

2,551నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

న్యూఢిల్లీలోని <>AIIMS<<>> 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (NORCET 10) దరఖాస్తులు కోరుతోంది. BSc(Hons.) నర్సింగ్, BSc(నర్సింగ్) , డిప్లొమా(GNM) అర్హత గలవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏప్రిల్ 11న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 30న) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsexams.ac.in