News April 29, 2024
అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ <<13146071>>ఫేక్<<>> వీడియో కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు. రీతోమ్ సింగ్ అనే వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ఈ ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.
Similar News
News December 25, 2025
వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు

AP: దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్‌పేయి అని CM చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు ఇది. విగ్రహంతో పాటు ఆయన చరిత్ర ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఈ శత జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉంది. దేవతల రాజధాని అమరావతికి ఒక నమూనాగా ఈ ప్రజా రాజధాని అమరావతిని నిలబెట్టాలన్నదే నా ధ్యేయం’ అని తెలిపారు.
News December 25, 2025
జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించే సింపుల్ చిట్కాలు!

జంక్ ఫుడ్ తినాలనే కోరిక మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్రలేమితో ముడిపడి ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినాలి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి జంక్ ఫుడ్ వైపు మనసు మళ్లదు. ఒత్తిడి తగ్గించుకోవడం, కంటినిండా నిద్ర, నీళ్లు బాగా తాగడం, ఫుడ్ బాగా నమిలి తింటే క్రేవింగ్స్ అదుపులో ఉంటాయి. స్నాక్స్‌గా పండ్లు, డ్రై ఫ్రూట్స్ బెస్ట్.
News December 25, 2025
వంటింటి చిట్కాలు

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.


