News February 5, 2026

ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ కీలకమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.

Similar News

News February 8, 2026

జీడిమామిడిలో ‘టి దోమ’ను ఎలా నివారించాలి?

image

చెట్లు చిగురించినప్పుడు తొలిసారి లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ఎసిటామాప్రిడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 2,3 వారాల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. వీటికి వేపనూనెను తగిన మోతాదులో కలిపితే మంచిది.

News February 8, 2026

ఉదయమా? సాయంత్రమా? ఎక్సర్‌సైజ్‌కు బెస్ట్ టైమ్ ఏది?

image

ఎక్సర్‌సైజ్ ఏ టైమ్‌లో చేసినా మంచిదే. కానీ చేసే సమయాన్ని బట్టి ఫలితాల్లో మార్పు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. సాయంత్రం 4-8 గంటల మధ్య కండరాల సామర్థ్యం పీక్‌లో ఉండి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు వీలవుతుంది. స్త్రీలు ఉదయం పూట వర్కవుట్ చేస్తే పొట్ట కొవ్వు, BP తగ్గుతాయి. అదే పురుషులకు సాయంత్రం వేళ వ్యాయామం వల్ల BP కంట్రోల్‌లో ఉంటుంది. అయితే రోజూ ఒకే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.

News February 8, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

image

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎం‌లకు అప్పగించామన్నారు.