News February 5, 2026

కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ బండారం బయటపడింది: కిషన్ రెడ్డి

image

దోచుకున్న డబ్బు పంచుకునే విషయంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కవిత వ్యవహారమే ఇందుకు నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో “సారు-కారు” అంటూ రాష్ట్రాన్ని ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక వాటాల గొడవలతో ఆ కుటుంబం రోడ్డున పడిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని కోరారు.

Similar News

News February 22, 2026

శ్రీకాకుళం: నకిలీ పాసుల కేసు తీవ్ర జాప్యం!

image

ఆదిత్యుని ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీఐపీ పాసులు కేసును సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తొలుత దర్యాప్తు చేశారు. అనంతరం మొదటి పట్టణ స్టేషన్ పోలీసులకు కేసు అప్పగించారు. దాదాపుగా నకిలీ పాసులు వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించారు. అయితే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రాజకీయ మద్దతు ఉండటం కేసు జాప్యానికి కారణమనే చర్చ నడుస్తోంది.

News February 22, 2026

BREAKING: గజ్వేల్‌లో RTC బస్సుకు యాక్సిడెంట్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలవగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే వారిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News February 22, 2026

పగలు ఎండ, రాత్రి ఠండా.. మధ్యలో వర్షాలు!

image

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రిళ్లు చలిగాలులు వీస్తుండగా పగలు ఎండ దంచి కొడుతోంది. ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలోని నందిగామ, కర్నూలులో నిన్న 37డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ వేడికి ఉక్కపోత మొదలైంది. ఇక వేసవి పూర్తిగా రాకముందే వర్షాలు ఎంటరవుతున్నాయి. అల్పపీడనం వల్ల నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.