News February 5, 2026

కామారెడ్డి: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ సూపర్‌వైజర్లను ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Similar News

News February 8, 2026

HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.

News February 8, 2026

తిరుపతి: మంచు విష్ణుకు నోటీసులు

image

తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో A-1 సతీశ్, A-2 మోహన్ బాబు, A-3గా విష్ణుపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న పోలీసులు విష్ణుకు నోటీసులు అందజేశారు. ఈ నెల 15 తరువాత ఆయన విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇది వరకే ఈ కేసు కొట్టివేయాలంటూ మోహన్ బాబు హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

News February 8, 2026

క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న <<19077394>>శంకుస్థాపన<<>> పడిన వేళ క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి అనే చర్చ మొదలయింది. ఇది సంప్రదాయ కంప్యూటర్లకు మించిన శక్తిమంతమైనవి. ఇప్పటి కంప్యూటర్లు 0, 1 బిట్లపై పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్‌పై ఆధారపడతాయి. క్యూబిట్ ఒకేసారి 0, 1గా ఉండగలగడం వల్ల అత్యంత వేగంగా పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు చేసే పనిని ఇవి సెకన్లలోనే చేస్తాయి.