News February 5, 2026

ఎల్లారెడ్డి: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించిన జిల్లా నోడల్ అధికారి

image

ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను గురువారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్డీఓ పార్థ సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన మొదటి విడత పరీక్షలు ప్రశాంతంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని వారు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News February 11, 2026

మహబూబాబాద్: 70.56% పోలింగ్ @3PM

image

మహబూబాబాద్ జిల్లాలో 3 గంటల వరకు 70.56 శాతం ఓటింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 73%, కేసముద్రం మున్సిపాలిటీలో 79.5%, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 66.62%, మరిపెడ మున్సిపాలిటీలో 79.65%, తొర్రూర్ మున్సిపాలిటీలో 68.93% కాగా.. మద్యాహ్నం 3 వరకు మొత్తంగా 70.56% పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు.

News February 11, 2026

పరకాలలో 70.15% పోలింగ్ @ 3PM

image

పరకాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 70.15% పోలింగ్ నమోదయింది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉండగా 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

News February 11, 2026

జగిత్యాల: వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల పరిశీలన

image

జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో జరుగుతున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామారావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్‌తో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఓటర్ల రద్దీని గమనించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదికలు ఇవ్వాలన్నారు.