News April 29, 2024
పాలకొండ: సబ్ జైలుని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి విజయరాజ్ కుమార్ సోమవారం సబ్ జైలును సందర్శించారు. జైలులో మౌలిక వసతుల పట్ల ఆరాతీశారు. జైలు సూపరింటెండెంట్ డి. జోగులు వేసవి దృష్ట్యా జైలు గదుల ఉపరితలాలపై కూల్ పెయింట్ వేయించినట్లు తెలియజేసారు. సారా అక్రమ వ్యాపార దుష్ప్రభావాలపై జూనియర్ సివిల్ జడ్జి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు బొడ్డు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
Similar News
News January 12, 2026
EEMT–2026 రిజల్ట్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ర్‌గా సిక్కోలు విద్యార్థి

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ (Educational Epiphany) సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన EEMT–2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. 10వ తరగతిలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని హెచ్.ఎం పద్మావతి నిన్న తెలియజేశారు. విద్యార్థిని అభినందించారు.
News January 12, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.