News April 29, 2024
ప్రశాంత్ వర్మతో మూవీ.. ‘రాక్షస్’గా రణ్‌వీర్?
‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘రాక్షస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో రణ్‌వీర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని పేర్కొన్నాయి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌తో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథాంశంతో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News December 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.
News December 28, 2024
RRR పనుల్లో కీలక పురోగతి
TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. మొత్తంగా 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్-రెడ్డిపల్లి, ప్యాకేజీ-2 రెడ్డిపల్లి-ఇస్లాంపూర్, ప్యాకేజీ-3 ఇస్లాంపూర్-ప్రజ్ఞాపూర్, ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్-రాయగిరి వరకు పనులకు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొంది.
News December 28, 2024
నితీశ్‌కు YS జగన్ అభినందనలు
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్‌బోర్న్‌లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్‌కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.