News February 6, 2026

NZB: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం బర్దిపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. TUలో రూ.20 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ బాలురు, బాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేస్తారు. రూ.600 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇండదవాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

Similar News

News February 25, 2026

సిరిసిల్ల: ‘మొబైల్ రికవరీ మేళా’.. 63 ఫోన్ల అందజేత

image

మొబైల్‌ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల పోలీసులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన, చోరీకి గురైన రూ. 6 లక్షల విలువైన 63 మొబైళ్లను ఐటీ కోర్ టీం రికవరీ చేసింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’లో ఎస్పీ మహేష్ బి. గితే బాధితులకు ఫోన్లను అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను వెలికితీసిన బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

News February 25, 2026

HYD: FSL హాల్‌ టికెట్లపై కీలక అప్డేట్.. రేపట్నుంచే

image

TG ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(FSL) రాత పరీక్షల హాల్‌ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని TSLPRB ఛైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ పీటీసీలో ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.