News April 29, 2024
బీజేపీలో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత

TG: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ బీజేపీలో చేరారు.
Similar News
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <