News April 29, 2024
T20 ప్రపంచకప్.. టీమ్ ఇండియా ఇదేనా?
టీ20 WC కోసం టీమ్ ఇండియా ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అయితే కింద పేర్కొన్న 15 మంది జట్టులో ఉంటారని espncricinfo తెలిపింది.
టీమ్: రోహిత్ (C), జైస్వాల్, విరాట్, సూర్య, సంజూ శాంసన్, పంత్, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్/సిరాజ్.
**కేఎల్ రాహుల్, చాహల్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ కూడా రేసులో ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News December 28, 2024
డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు.. దాన్ని నమ్మొద్దు: డీజీపీ
AP: దేశంలో తొలిసారి మనమే స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకాతిరుమల రావు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకు స్టార్మ్ పోలీస్ ఏఐ సాయం చేస్తుందన్నారు. ఇక డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి వాటిని నమ్మొద్దని డీజీపీ సూచించారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటి ద్వారా నేరస్థులు రూ.1229Cr తస్కరించారన్నారు.
News December 28, 2024
జనంలోకి జనసేనాని
AP: కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, స్థితిగతులను నేరుగా ఆయనే తెలుసుకోనున్నారు. త్వరలోనే పర్యటన షెడ్యూల్, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
News December 28, 2024
సల్మాన్‌తో నేను డేట్ చేయలేదు: ప్రీతి జింటా
సల్మాన్ ఖాన్‌తో తాను ఎప్పుడూ డేటింగ్ చేయలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తెలిపారు. ఎక్స్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. ‘సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. నా భర్తకు కూడా ఆయన బెస్ట్ ఫ్రెండ్. మేమెప్పుడూ ఇలాగే ఉంటాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరూ కలిసి చోరీ చోరీ చుప్కే చుప్కే, జాన్ ఈ మన్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, దిల్ నే జిసా అప్నా వంటి చిత్రాల్లో నటించారు.