News February 6, 2026

HYD: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘డిజిటల్‌’ స్కామ్..?

image

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్ కాలేజీల డిజిటల్ దగా బట్టబయలైంది. సాంకేతిక లోపమని మేనేజ్‌మెంట్లు బుకాయించినా, మధ్యాహ్నం 3:15కు సీసీ కెమెరాలను ముందస్తు ప్లాన్ ప్రకారమే మాన్యువల్‌గా లాగ్-అవుట్ చేసినట్లు సర్వర్ లాగ్స్‌లో తేలింది. వైవా బుక్లెట్లపై ‘ప్రాక్సీ’ సంతకాల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈస్కామ్‌తో ఇప్పటికే 16మంది సిబ్బందిపై వేటు పడగా, 22 కాలేజీల గుర్తింపు రద్దు దిశగా బోర్డు అడుగులు వేస్తోంది.

Similar News

News February 9, 2026

బంజారాహిల్స్‌లో నిలోఫర్ కొత్త వెజ్ హబ్ ప్రారంభం

image

హైదరాబాద్‌లో విశ్వసనీయ ఆహార బ్రాండ్ నిలోఫర్ బంజారాహిల్స్‌లో తన కొత్త రూఫ్‌టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ Niloufer Chathను ప్రారంభించింది. నార్త్ ఇండియన్ వెజ్ రుచులు, ఆధునిక డిజైన్, ప్రీమియం అంబియెన్స్‌తో ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. నాణ్యత, నమ్మకమే తమ లక్ష్యమని ఛైర్మన్ అనుముల బాబు రావు, MD శశాంక్ తెలిపారు. MLA దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని ప్రశంసించారు.

News February 9, 2026

BREAKING: HYDలోని హాస్టళ్లలో తనిఖీలు

image

నగరంలోని PG హాస్టళ్లపై పోలీసుల నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ హెచ్చరించారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.

News February 9, 2026

హైదరాబాద్‌: తిండి కంటే ఫొటోలకే క్రేజ్‌!

image

హైదరాబాద్‌ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.