News February 6, 2026
నేడు కర్నూలు జిల్లా పర్యటనకు CM

సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 11:40కి గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం వారికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సుమారు 1200 మంది పోలీసులతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News February 12, 2026
వరంగల్: బాక్సులో భవిష్యత్!

మున్సిపల్ పోరు ముగిసింది. ఇక ఫలితమే బాకీ ఉంది. బ్యాలెట్ బాక్సులో భవిష్యత్ ఉండటంతో అభ్యర్థుల్లో లబ్ డబ్ అంటూ గుండె వేగం పెరిగింది. మరో 24 గంటల్లో తమ పెట్టబడికి లాభామా? నష్టమా? అంటూ మథన పడుతున్నారు. మరో పక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎంత అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్, BRSలు ఇప్పటికే వార్డుల్లో సర్వే చేసుకున్నాయి.
News February 12, 2026
Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.
News February 12, 2026
BNGR:మున్సిపల్ ఎన్నికలు అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2026లో 2 శాతం మేర తగ్గింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మొత్తం 1,30,192 ఓటర్లు ఉండగా 1,13,398 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 87.1 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ శాతం తగ్గాడానికి కారణాలు కామెంట్ చేయండి.


