News February 6, 2026

బర్డ్ ఫ్లూతో కాకులు మృతి.. చెన్నైలో అలర్ట్

image

తమిళనాడులో బర్డ్ ఫ్లూ కేసులు కలవరపెడుతున్నాయి. చెన్నైలోని అడయార్, అవడి, ఈసీఆర్‌లో జనవరి నుంచే 1000కిపైగా కాకులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కాకుల మరణంపై బోపాల్‌లోని లాబోరేటరీలో చేసిన పరీక్షల్లో H5N1 వైరస్ కారణమని తేలింది. దీంతో పక్షులు చనిపోయి కనిపిస్తే తాకకూడదని, పిల్లలను దూరంగా ఉంచాలని ప్రజలకు అధికారులు సూచించారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలన్నారు.

Similar News

News February 19, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు

image

బీబీనగర్‌లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్‌, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in

News February 19, 2026

క్యాబేజీ సాగుకు అనుకూల నేలలు, విత్తన మోతాదు

image

కూరగాయల్లో అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. ఇక విత్తన మోతాదుకు విషయానికొస్తే ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్‌ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.

News February 19, 2026

మార్చి రెండో వారంలో TG బడ్జెట్ సమావేశాలు!

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు MAR 2వ వారంలో ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీ బడ్జెట్ మీటింగ్‌లు ఈనెలాఖరు వరకు ఉన్నాయి. ఆ తరువాతే తుది బడ్జెట్‌ ఖరారు చేయాలి. MAR మొదటి వారానికి ఈ ప్రక్రియ ముగుస్తుందని ‘ఫైనాన్స్’ వర్గాల అంచనా. అదయ్యాకే అసెంబ్లీ భేటీ ఉంటుందని చెబుతున్నాయి. ఈనెల 23న క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా తన కుమారుడి పెళ్లి MAR 5న ఉండడంతో ఆర్థిక మంత్రి భట్టి ఆ బిజీలో ఉన్నారు.