News February 6, 2026

మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

image

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.

Similar News

News February 17, 2026

‘కుతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజలు లేవు’

image

కొందరు వ్యక్తులు తమకు అన్నీ తెలుసని, తాము చాలా గొప్పవారమని గంభీరమైన మాటలు చెబుతుంటారు. కానీ పని అప్పగిస్తే ఏమీ చేయలేరు. అలాగే పెద్ద కుప్పలా ఉన్న ధాన్యాన్ని గాలికి ఎగబోసేటప్పుడు అందులో నుంచి శబ్ధం(కుతల) వస్తుంది. తీరా చూస్తే అందులో అసలైన గింజలు (ధాన్యం) లేకుండా, కేవలం పొట్టు లేదా తాలు మాత్రమే ఉంటే “వట్టి కుతల ఆర్భాటమే తప్ప, కుప్పలో గింజలు లేవు” అనే సామెతను రైతులు వాడుతుంటారు.

News February 17, 2026

అధిక మాసం ఎలా ఏర్పడుతుందో తెలుసా?

image

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. అయితే చంద్రుని గమనం ఆధారంగా 12 మాసాలకు 354 రోజులు పడుతుంది. ఈ రెండింటి మధ్య ఏటా వచ్చే 11 రోజుల తేడాను సవరించడానికి ప్రతి మూడేళ్లకు ఓసారి ఓ నెలను అదనంగా కలుపుతారు. దీనినే అధిక మాసం అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. ఇది పండుగలు, రుతువుల క్రమం తప్పకుండా ఉండటానికి సహాయపడుతుంది.

News February 17, 2026

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసిన ఇండియా!

image

ఇరాన్‌కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లను ఇటీవల ముంబై తీరంలో ఇండియా స్వాధీనం చేసుకుందని Reuters వెల్లడించింది. వీటిపై US ఆంక్షలు ఉన్నట్లు చెప్పింది. ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు, ట్రాకింగ్‌కు దొరక్కుండా, ఐడెంటిటీ తెలియకుండా చేసే షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్స్‌కు తమ జలాలను ఎవరూ ఉపయోగించకూడదని ఇండియా కోరుకుంటోందని పేర్కొంది. ఈ నౌకలు తరచూ గుర్తింపు మార్చుకుంటాయని, వాటి ఓనర్లు విదేశాల్లో ఉన్నారని తెలిపింది.