News April 29, 2024

SSC ఫలితాలు Way2Newsలో సేఫ్‌గా పొందండి

image

మంగళవారం విడుదలయ్యే TG SSC ఫలితాలను అందరికంటే ముందు Way2News యాప్‌లో పొందండి. అధికారులు ఉదయం గం.11కు ఫలితాలు విడుదల చేసిన క్షణాల్లోనే మీ రిజల్ట్ తెలుసుకోవచ్చు. యాప్‌లోని స్పెషల్ స్క్రీన్‌లో మీ H.T.No. ఇస్తే సెకన్లలో రిజల్ట్ వస్తుంది. ఒకే క్లిక్‌తో రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. సైట్లలా ఇబ్బందికర యాడ్స్, హానికర బ్యాగ్రౌండ్ డౌన్‌లోడ్స్ మన యాప్‌లో ఉండవు.
Way2News.. Simplest.. Fastest.. Safest!!

Similar News

News April 10, 2026

పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.

News April 10, 2026

పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

News April 10, 2026

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.