News April 29, 2024

ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% ఉద్యోగులపై వేటు!

image

ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ బక్షి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన హేమంత్ నాలుగు నెలలు తిరగకుండానే వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం ఆ బాధ్యతలను ఓలా సహవ్యవస్థాపకుడు భవేశ్ అగర్వాల్ పర్యవేక్షిస్తారని, త్వరలోనే కొత్త సీఈఓ నియామకం ఉంటుందని సమాచారం. మరోవైపు సంస్థ పునరుద్ధరణలో భాగంగా చేపట్టనున్న చర్యలతో 10% మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 8, 2025

రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.

News November 8, 2025

₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

image

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్‌, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.

News November 8, 2025

మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

image

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.