News February 6, 2026

పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు

image

గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, BRS మధ్యనే సాగింది. కానీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారి బీజేపీ సైతం బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో మునిసిపల్ ఎన్నికలలో త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది. ఏ డివిజన్, వార్డులలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Similar News

News February 17, 2026

నిర్మల్: మైనార్టీలకు ఉచిత శిక్షణ

image

మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ (ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు జైనులు) యువతకు ఉచిత నైపుణ్య శిక్షణను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ట్యాలీ విత్ జీఎస్టీ, డిజిటల్ మార్కెటింగ్, అకౌంట్ అసిస్టెంట్, ఫైర్ అండ్ సేఫ్టీలలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 17, 2026

మక్తల్: 6వ వార్డు అభ్యర్థిగా ఎరుకల సత్యమ్మ

image

మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు BJP అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఓటింగ్ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. కాగా తాజాగా అక్కడి నుంచి దివంగత మహదేవప్ప భార్య ఎరుకల సత్యమ్మ పోటీ చేస్తుందని BJP కార్యవర్గ సభ్యులు కొండయ్య తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తనపై పార్టీ నుంచి గాని ఇతరుల నుంచి గాని ఎటువంటి ఒత్తిడి లేదని తన భర్త ఆశయాలకై తానే స్వయంగా బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు.

News February 17, 2026

KNR: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలు, గోదాములను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు మరియు నిల్వల రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. యూరియా కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడి, బుకింగ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.