News February 6, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో ‘మున్సిపల్’ పోరు

image

ఉమ్మడి KNR జిల్లాలో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్సిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. తాము చేపట్టిన పనులను ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని BRS ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్ర నిధులతో పట్టణాల రూపురేఖలు మారుస్తామని BJP హామీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

Similar News

News February 9, 2026

డెడ్‌లైన్‌లోపు నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

image

ఆర్థిక నెట్‌వర్క్‌లను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలిచ్చాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భద్రతా వ్యూహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకంగా మారాయన్నారు. మార్చి 31లోపు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాయపూర్‌లో నక్సల్స్‌ వ్యతిరేక కార్యకలాపాలపై పలు రాష్ట్రాల, కేంద్ర సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించినట్టు SMలో పోస్ట్ పెట్టారు.

News February 9, 2026

జపాన్ ప్రధాని తకైచిని అభినందించిన మోదీ

image

జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రధాని సనే తకైచిని PM నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె సమర్థవంతమైన లీడర్‌షిప్‌లో ఇరుదేశాల స్నేహబంధం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నట్టు SMలో పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో ఇండియా, జపాన్‌ల స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 9, 2026

HYD: చుక్కేస్తుంటే.. చెక్కేశారు..!

image

మద్యం సేవిస్తున్న వ్యక్తి నుంచి కొందరు దుండగులు కలిసి బంగారు గొలుసు తెంపుకుని పరారైన ఉదంతం ఇది. పీర్జాదిగూడకు చెందిన అశోక్‌కుమార్‌ (46) బోడుప్పల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. ఇదే అదనుగా వచ్చిన ముగ్గురు దుండగులు అతని మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలు, ఫోన్, వాలెట్‌ను దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.