News April 29, 2024

ఓయూలో సమస్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

image

TG: ఓయూలో నీళ్లు, విద్యుత్ కొరతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ పోతోందని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌పై అభాండాలు మోపాలని చూస్తున్నారని అన్నారు.

Similar News

News January 22, 2026

మహాశివరాత్రి ఏరోజు జరుపుకోవాలి?

image

మహా శివరాత్రి ఏటా మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున వస్తుంది. సాధారణంగా హిందూ పండుగలు ఉదయం పూట తిథి ఉన్న రోజున జరుపుకుంటారు. కానీ శివరాత్రికి మాత్రం రాత్రి సమయంలో తిథి ఉండటం ప్రధానం. ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 (ఆదివారం) సా.4.47కి ప్రారంభమై 16న (సోమవారం) సా.5.32కి ముగియనుంది. అర్ధరాత్రి చతుర్దశి ఉన్న 15వ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

News January 22, 2026

మీరు మా వల్లే బతుకుతున్నారు.. కెనడా PMపై ట్రంప్ ఫైర్

image

దావోస్ వేదికగా కెనడాపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘US వల్లే కెనడా బతుకుతోంది. మా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మార్క్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ ఆర్థిక శక్తిని వాడుకుని ఇతర కంట్రీస్‌ను భయపెడుతున్నాయని, అందుకే మధ్యస్థ దేశాలన్నీ ఏకం కావాలని కెనడా PM మార్క్ కార్నీ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ సీరియస్ అయ్యారు.

News January 22, 2026

40వేల మందితో సమగ్ర భూసర్వే చేయించాం: జగన్

image

AP: 40వేల మంది సిబ్బందితో భూముల రీసర్వే సమగ్రంగా చేయించామని YS జగన్ పేర్కొన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. ఈస్థాయిలో రైతులకు, ప్రజలకు మేలు చేసిన GOVT ఏదీలేదు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ రికార్డులు సిద్ధం చేశాం’ అని వివరించారు. ఏదో రాయిని పెట్టేసి వదిలేయకుండా అధికారిక సరిహద్దులు చూపేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.