News February 6, 2026
హైదరాబాద్ తాజ్‌మహల్ గురించి తెలుసా?

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.
Similar News
News February 10, 2026
ఖమ్మం: రెండు రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరగనున్న వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం పరిధిలో ఈనెల 10, 11వ తేదీల్లో స్థానికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. కాగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News February 10, 2026
షమీకే ఎందుకిలా?

గాయంతో జట్టుకు దూరమై రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా <<19095739>>BCCI<<>> ప్రకటించిన కాంట్రాక్ట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. గత కొంతకాలంగా దేశవాళీలో ఆడుతున్నప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు లిస్టులోనూ పేరు లేకపోవడంతో BCCI అతడిని పక్కనపెట్టిందా అనే చర్చ జరుగుతోంది. షమీ గతేడాది మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
News February 10, 2026
పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్‌లో 59, నంద్యాల డివిజన్‌లో 26 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16లోగా indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470


