News April 29, 2024

HYD: ప్రాణాలు కాపాడిన పోలీస్‌కు సత్కారం

image

ట్యాంక్‌బండ్‌‌‌లో దూకి ఆత్మహత్యకు‌ యత్నించిన ఓ మహిళను TSSP కానిస్టేబుల్ అశోక్ కాపాడిన విషయం తెలిసిందే. అశోక్‌ అప్రమత్తత పట్ల అక్కడి వారు ప్రశంసలు కురిపించారు. సోమవారం TSSP అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా కానిస్టేబుల్ అశోక్‌‌ని కలిసి అభినందించారు. విధి నిర్వహణ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు.

Similar News

News November 7, 2025

జూబ్లిహిల్స్ బైపోల్స్: సమయం లేదు మిత్రమా.. !

image

ప్రచారానికి గడవు ఈరోజుతోపాటు ఉన్నది మూడు రోజులే.. అంతే.. అదీ ఆదివారం సాయంత్రానికి క్లోజ్.. అందుకే నాయకులు నిద్రపోవడం లేదు. రాత్రి వరకు ప్రచారం చేసి రాత్రి వేళ స్థానిక నాయకులతో మంతనాలు.. ఏ ఓటు ఎవరికి వచ్చే అవకాశం.. మనకెన్ని ఓట్లు వస్తాయనే విషయంపైనే సమాలోచనలు.. ఓటు మనకు రాకపోతే ఎలా రాబట్టుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ మూడు రోజులను పక్కాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

image

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్‌‌లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.

News November 7, 2025

22 నుంచి నగరంలో పలు చోట్ల భగవద్గీత పోటీలు

image

టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భగవద్గీత పోటీలు జరుగనున్నాయి. 22న కుత్బుల్లాపూర్(వేణుగోపాలస్వామి గుడి), 28న టీటీడీ బాలాజీ భవన్, 29న సరూర్‌నగర్ (విక్టోరియా మెమోరియల్ స్కూల్)లో పోటీలు జరుగుతాయని టీటీడీ అధికారి రమేశ్ కుమార్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 90308 50336 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.