News February 6, 2026

మృతుడు మైలారం వాసి.. UPDATE

image

వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు జయశంకర్ జిల్లా గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన రాజుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బండి నిఖిల్(మైలారం), ఇండ్ల సుమన్(కనిపర్తి), రాపూరి రాజేష్(గుంటూరు)కు చెందినవారుగా సమాచారం.

Similar News

News February 7, 2026

400 సీట్లుకు దరఖాస్తు చేసుకోండి: డిప్యూటీ డైరెక్టర్

image

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మంగదయ్య శనివారం తెలిపారు. రాజవొమ్మంగి(బాలికలు ), రంపచోడవరం(బాలురు, బాలికలు), కూనవరం(బాలికలు ), అడ్డతీగల(బాలురు) పాఠశాలల్లో 400 ఖాళీలు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న st విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 28లోగా అప్లై చేసుకోవాలన్నారు.

News February 7, 2026

ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్

image

రూ. 28 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో పరారీలో ఉన్న కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ACBఅధికారులు అరెస్ట్ చేశారు. జనవరి 3న రేంజర్ రాజేందర్ రూ.3.50లక్షలు తీసుకుంటూ దొరికినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. వైజాగ్‌లో ఆమెను ACB అదుపులోకి తీసుకుంది. నేడుకోర్టులో ప్రవేశపెట్టనుంది. టన్ను యూకలిప్టస్ కర్రపై రూ. 90 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.

News February 7, 2026

నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

image

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.