News April 29, 2024
మే 1న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ సభ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 1న పెందుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆ పార్టీ నాయకులకు సమాచారం అందింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్ బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభకు జన సేకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పెందుర్తి జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.
Similar News
News July 5, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2025
విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.
News July 5, 2025
విశాఖలో ఏఐతో ఛలానాలు..!

విశాఖ సిటీలో ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్క్ తెలిపారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ రామరాజు, ఇతర అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు సంస్థలు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా అతివేగం, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలకు ఆటోమేటిక్ ఛలానా జారీ అవుతుందన్నారు.