News April 29, 2024
రేవంత్ క్షమాపణ చెప్పాలి: కిషన్ రెడ్డి

TG: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘రేవంత్ అసత్య ప్రచారాలతో, మార్ఫింగ్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. BJP, RSSపై ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. స్వయంగా RSS చీఫ్ మోహన్ భాగవత్ ఈ విషయాన్ని ఖండించారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 31, 2025
తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు

ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీసం ఏదైనా డిగ్రీతోపాటు స్వర మాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21-50 ఏళ్ల మధ్య వారు అర్హులు. రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 15వ తేదీలోగా ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి చిరునామాకు పంపించాలి.
News December 31, 2025
ఏంటీ AGR రచ్చ? వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఇచ్చిన ఊరట ఇదే!

వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం భారీ ఊరటనిచ్చింది. AGR అనేది టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు. తమకు కేవలం ఫోన్ కాల్స్, డేటా ద్వారా వచ్చే ఆదాయంపైనే ఫీజు వేయాలని కంపెనీలు వాదించగా.. అద్దెలు, డివిడెండ్లు సహా ఇతర ఆదాయాలను కూడా కలపాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికే మద్దతు తెలపడంతో కంపెనీలపై ₹వేల కోట్ల అదనపు భారం పడింది.
News December 31, 2025
తెలుగు ప్రజలకు నేతల శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు CMలు, నేతలు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘పింఛన్లు అందుకున్న లబ్దిదారులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు’ అని CM CBN ట్వీట్ చేశారు. ‘కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలును చేరుకోవాలని’ అని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘2026లో కూటమి మరింత మెరుగైన సేవలందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది’ అని పవన్ ట్వీట్ చేశారు. ‘కొత్త ఏడాది ప్రతొక్కరి ఇంట్లో ఆనందం నింపాలని’ జగన్ కోరుకున్నారు.


