News April 29, 2024

OUలో దుస్థితికి రేవంత్, భట్టి ఏం సమాధానం చెప్తారు?: హరీశ్ రావు

image

TG: ఉస్మానియా వర్సిటీలో విద్యుత్, నీటి కొరత కారణంగా హాస్టళ్లకు <<13145680>>సెలవు<<>> ప్రకటించారన్న వార్తలపై హరీశ్‌రావు స్పందించారు. ‘రాష్ట్రంలో కరెంటు కోతలు, తాగు నీటి కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? వందేళ్ల చరిత్ర కలిగిన వర్సిటీలో సమస్యలున్నాయని విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించిన ఘనత INCకే దక్కింది. దీనికి రేవంత్, భట్టి ఏం సమాధానం చెబుతారు?’ అని Xలో ప్రశ్నించారు.

Similar News

News November 8, 2025

‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

image

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.

News November 8, 2025

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in

News November 8, 2025

గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

image

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.