News April 29, 2024
మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది పోటీలో నిలువగా వారిలో 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. YCP అభ్యర్థిగా డా. సింహాద్రి చంద్రశేఖర్, జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ, తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 7, 2025
గన్నవరంలో యాక్టీవ్ అవుతున్న వల్లభనేని వంశీ

గన్నవవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారు. నకిలీ పట్టాల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో వంశీ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల వై.ఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
News November 7, 2025
పాడి పరిశ్రమ అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఘనమైనది: కలెక్టర్

పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఎంతో ఘనమైనదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రజల జీవనోపాదులను మెరుగుపరచడంలో మరింత కృషి చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువుల మిషన్-శాస్త్రీయ నిర్వహణ గొర్రెలు, మేకల పెంపకం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
News November 6, 2025
మచిలీపట్నం: ఎన్నికల చట్టాలు, నిబంధనలపై వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలోని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం నియోజకవర్గాల రెవెన్యూ శాఖేతర అధికారులుగా డీఎస్‌వో, డీఎం పౌరసరఫరాల సంస్థ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ముడా వీసీలు ఓటర్ల నమోదు అధికారులుగా ఉంటారన్నారు.


