News February 6, 2026
పొదిలిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న రథం

దక్షిణ కాశీగా పేరుగాంచిన పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి రథోత్సవానికి ముస్తాబు మొదలైంది. శుక్రవారం ఆలయ ఛైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, దాత నాగేశ్వరరావు రథం అలంకరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. మహాశివరాత్రి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగే ఈ రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2026
ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్‌ఫర్

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.
News February 7, 2026
మార్కాపురం: కోరిక తీర్చలేదని చంపేశాడు..!

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.


