News April 29, 2024
కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.
Similar News
News September 9, 2025
కడప: ఉల్లి కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూరియాపై రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
News September 8, 2025
కడప జిల్లాలో 11,628 ఎకరాల్లో ఉల్లి సాగు

కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828 ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.
News September 8, 2025
YVU లలితకళా విభాగం స్కాలర్ సుజాతకు స్పెయిన్ దేశం ఆహ్వానం

YVU లలితకళా విభాగం స్కాలర్ సుజాతకు 2026 మేలో స్పెయిన్లో జరుగనున్న అంతర్జాతీయ సెమినార్‌కు నిర్వాహకులు ఫెర్నాండెజ్ ఈమెయిల్ ద్వారా ఆహ్వానించారు. ఈ పర్యటనకు వీసా ఇతరా ఖర్చులు భరిస్తామని వారు తెలిపారు. సుజాత ఫైన్ ఆర్ట్స్ హెడ్ డా.కోట మృత్యుంజయ రావు మార్గదర్శకత్వంలో ‘విజయనగర పెయింటింగ్స్’ మీద పరిశోధన చేస్తున్నారు. VC శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.పద్మ ఆమెను అభినందించారు.