News February 6, 2026

అమ్మవారి సేవలో టీటీడీ నూతన ఈవో

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద జేఈవోలు వీరబ్రహ్మం, శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు వేదశీర్వచనంతో అమ్మవారి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News

News February 23, 2026

పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

image

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

News February 23, 2026

నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

image

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 23, 2026

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే?

image

ఇంట్లో నెమలి పెయింటింగ్‌ ఉండటం చాలా మంచిదని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘దానివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనిని లివింగ్ రూమ్‌లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. నెమలి అందం ఇంటికి ఆకర్షణీయ రూపాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతిమంగా సానుకూల మార్పులకు దారి తీస్తుంది’ అంటున్నారు.