News February 6, 2026

NLG: ప్రలోభాలను అణచివేయండి: రాణి కుముదిని

image

మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలను అణచివేయాలని, అక్రమ మద్యం, నగదు రవాణాపై ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు.

Similar News

News April 20, 2026

NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.