News February 6, 2026
సిరిసిల్ల : ముగిసిన కేటీఆర్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులుగా సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. 39 వార్డులలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. శ్రీనగర్ కాలనీవాసులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎండగడుతూనే, బీజేపీపై నిప్పులు చెరిగారు. అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ శుక్రవారం అక్కడే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 19, 2026
TG EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు <
News February 19, 2026
వేములవాడ రాజన్న ఆలయ పనులకు వినియోగిస్తున్న వాహనం సీజ్

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు వినియోగిస్తున్న టిప్పర్‌ను మోటార్ వాహన తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ట్యాక్స్ కట్టకుండా వినియోగిస్తున్న వాహనాన్ని గుర్తించిన ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐలు రజనీ దేవి, పృథ్వీరాజ్ వర్మ టిప్పర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓవర్ లోడ్ లేదా ట్యాక్స్ చెల్లించని 10 వాహనాలను గురువారం సీజ్ చేసినట్లు వారు తెలిపారు.
News February 19, 2026
రేపు యశ్ ‘టాక్సిక్’ టీజర్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 9.35 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలవనుంది.


