News April 29, 2024
రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: ఎంపీ రాములు

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బిజెపి బీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సమావేశంలో బీసీ మోర్చ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
News September 13, 2025
MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
News September 12, 2025
MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.