News April 29, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు
✒MP ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు: MBNRలో 31..NGKLలో 19 మంది అభ్యర్థులు
✒కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: దీపాదాస్ మున్సీ
✒MBNR:రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✒సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త: పోలీసులు
✒లింగాల:వివాహిత దారుణ హత్య
✒లోక్ సభ ఎన్నికలు.. పటిష్ఠ నిఘా:SPలు
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల స్లీప్స్ పంపిణీ
✒పోలీస్ ప్రజావాణి: సమస్య పరిష్కారం పై ఫోకస్
✒ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు
Similar News
News December 29, 2024
పాలమూరు టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు !
ఉమ్మడి పాలమూరు జిల్లా టెట్ అభ్యర్థులకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వచ్చే నెల 2-20 మధ్య తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు సమర్పించే సమయంలో 16 కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఆధారంగా ఇచ్చిన జిల్లాలో కాకుండా చివరి ప్రాధాన్యతలో దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
News December 29, 2024
MBNR: 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 9,41,395 రేషన్ కార్డులు ఉన్నాయి. డీలర్లు ప్రతి నెల 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అర్హత ఉన్నా లబ్ధిదారులు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-739, NGKL-573, GDWL-351, NRPT-301, WNPT-328 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుడికి ఆరు కిలోల బియ్యం మంజూరు చేస్తోంది.
News December 29, 2024
ఉపాధి హామీ పథకం.. నాగర్‌కర్నూల్ టాప్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,70,214 జాబ్ కార్డులు ఉన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో జాబ్ కార్డులు ఉన్నాయి. దాదాపు 20 లక్షల కూలీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పురుషుల కంటే మహిళలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సుమారుగా 3,000 పైగా కుటుంబాలు వందరోజుల పనులను పూర్తి చేసుకున్నారు.