News April 29, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గని ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. సిద్దిపేట 44.3, సదాశివపేట 43.6, కొండాపూర్ 43.5, నిజాంపేట 43.4, తుక్కాపూర్ 43.2, దూల్మిట్ట, వట్ పల్లి లలో 43.1, చేగుంట, కౌడిపల్లి, శనిగరం లలో 42.9, బెజ్జంకి 42.8, బీహెచ్ఈఎల్ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News July 7, 2025

మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

image

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 6, 2025

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఖాజాపూర్ వాసి ఎంపిక

image

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కి చెందిన విష్ణు శ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. జులై 12, 14వ తేదీల్లో దెహ్రదూన్‌లో జరిగే జాతీయ రగ్బీ పోటీలలో చరణ్ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

News July 5, 2025

మెదక్: IIITకి 345 మంది ఎంపిక

image

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.