News February 7, 2026
అనకాపల్లి: 10 విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

తత్కాల్ స్కీమ్‌లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు రూ.1,000 ఫైన్‌తో ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాల మేరకు రెగ్యులర్, ఒకసారి పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ నెల12వ తేదీ వరకు www.bseap.org వెబ్ సైట్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 22, 2026
నల్గొండ: ఉపాధి కోసం ప్రాణాలు పోతున్నాయ్..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసాయన పరిశ్రమలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాలుష్యంతో ఇప్పటికే నరకం చూస్తున్న జనం, ఇప్పుడు ఈ పేలుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో సుమారు 150 వరకు రసాయన పరిశ్రమలు ఉండగా అందులో అత్యధికం CPL, పోచంపల్లి మండలాల్లోనే ఉన్నాయి.
News February 22, 2026
తగ్గిన చికెన్ రేట్లు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. విజయవాడలో కేజీ స్కిన్ లెస్ కోడి మాంసం రూ.200 పలుకుతోంది. గుంటూరులో రూ.190, నరసరావుపేటలో రూ.230కి విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కేజీ చికెన్ రేట్ రూ.230-250 మధ్య సేల్ చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రూ.240-260గా ఉంది. మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి?
News February 22, 2026
నేడు కామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డికి రానున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు వర్గాలు తెలిపాయి. నిన్న అనివార్య కారణాలవల్ల రాలేకపోయారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే రమణారెడ్డితో భేటీ కానున్నారు. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.


