News April 29, 2024
PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరెడ్డి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర అధ్యక్షుడుగా వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు PDSU జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను నియమించారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్ట పరచాలని నూతన అధ్యక్షుడు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News March 24, 2026
వరంగల్ జిల్లాలో టీబీ కేసులు.. వైద్యుల సూచనలు

జిల్లాలో టీబీ (క్షయ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 73,991 మందికి పరీక్షలు చేయగా 1,260 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,780 మందికి పరీక్షలు నిర్వహించగా 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు 876 మంది చికిత్స పొందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
WGL: రైతన్నకు ‘భరోసా’.. ఖాతాల్లో నిధుల జమ

యాసంగి సాగుకు సంబంధించి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ జిల్లాలో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 1,55,169 మంది రైతుల ఖాతాల్లో రూ.75.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈ సాయం విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు.
News March 23, 2026
పది పబ్లిక్ పరీక్షలకు WGL జిల్లాలో 99.86% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..


