News February 7, 2026
అద్దంకిలో ప్రార్థనా మందిరంపై దాడి..!

అద్దంకి రామ్‌నగర్‌లోని ఓ ప్రార్థనా మందిరంపై బుధవారం దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంగులూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి చర్చిని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నారు. 15 మంది వ్యక్తులు మందిరంపై దాడిచేసి, లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బరాజు శుక్రవారం వెల్లడించారు.
Similar News
News February 13, 2026
డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్, ప్లాంక్స్ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.
News February 13, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన B.Tech (1-1, 1-2), BBA (1-1, 1-2, 2-1), BCA (1-1) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News February 13, 2026
రేపు విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO మాణిక్యం నాయుడు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని అన్నారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.


