News April 29, 2024
వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్, బుజబుజ నెల్లూరు చెక్ పోస్ట్ లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హాఫిజ్ సోమవారం తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్ పోస్టులు, ముఖ్య కూడళ్లలో వద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అక్రమ రవాణా లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News March 2, 2026
‘నెల్లూరు కలెక్టర్ చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’

‘కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’ అంటూ కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు వచ్చారు. 2025 సెప్టెంబర్ 22న నడవలేని స్థితిలో ఉన్న రమాజ్యోతి కలెక్టరేట్‌కి వచ్చింది. కలెక్టర్ ఆమె సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం చూపారు. కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి PGRSలో అందిన మొదటి అర్జీ ఇదే కావడం విశేషం.
News March 2, 2026
నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 2, 2026
నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.


