News February 7, 2026

SRPT: మేడారంలో మైనర్ల లవ్ మ్యారేజ్.. సూసైడ్ అటెంప్ట్

image

ఖమ్మంలో చదువుకుంటున్న మైనర్ జంట ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం రఘునాథపాలెం మండలానికి చెందిన బాలిక, SRPT(D) ఆత్మకూరుకు చెందిన బాలుడు ఖమ్మంలో ఇంటర్ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దలు నిరాకరించడంతో మేడారంలో వివాహం చేసుకున్నారు. మేజర్లు అయ్యేవరకు ఆగాలని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 9, 2026

ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

image

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్‌ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్‌, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News February 9, 2026

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News February 9, 2026

T20WCలో నేడు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్