News February 7, 2026

రంగారెడ్డి: మున్సిపల్‌ ‘కుర్చీ’ కోసం.. ఆస్తులు గుల్ల!

image

ఉమ్మడి RR జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచార పర్వం మొదలవడంతో అభ్యర్థుల ఖర్చు అంచనాలు మించిపోతోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచితీరాలనే సంకల్పంతో అభ్యర్థులు ఎంతైనా వెచ్చించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మెజార్టీ అభ్యర్థులు సంపన్నులే అయినప్పటికీ చేతిలో ఉన్న కొద్దిపాటి నగదు నామినేషన్‌కు ముందే ఖర్చవడంతో నిధుల వేటలో నిమగ్నమయ్యారు. కాగా, కొందరు బంగారం, ప్లాట్లు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 9, 2026

ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం

image

T20WCలో ఐర్లాండ్‌పై శ్రీలంక 20 రన్స్ తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఐర్లాండ్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. టెక్టర్(40), అడైర్(34), లార్కన్(21) మాత్రమే రాణించారు. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కొంతసేపు ఐర్లాండ్ డామినేషన్ కనిపించినా ఆఖరికి ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో 3, పతిరాణా 2, వెల్లలాగే, చమీర చెరో వికెట్ తీశారు.

News February 9, 2026

Jr.NTR న్యూ లుక్.. ఫ్యాన్స్ హ్యాపీ

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటిస్తున్న సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో జరగనుంది. ఇందుకోసం ఈరోజు ఎన్టీఆర్ HYD నుంచి జోర్డాన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో తీసిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. కొన్ని నెలల క్రితం తారక్ సన్నబడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ తాజా లుక్‌ చూసి ఖుషీ అవుతున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా మే 20న గ్లింప్స్ లేదా టీజర్ రిలీజయ్యే ఛాన్సుంది.

News February 9, 2026

రామగుండం: మున్సిపల్ ప్రచారంలో జనసంద్రం

image

రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా MLA M.S రాజ్ ఠాకూర్ ఓల్డ్ అశోక్ సెంటర్ వద్ద నిర్వహించిన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ పార్టీ ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.