News February 7, 2026
నల్గొండ: ‘వాటర్ బెల్’ మోగట్లేదు..!

NLG జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అటకెక్కింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు జిల్లాలోని 1,483 పాఠశాలల్లో రోజుకు మూడుసార్లు నీరు తాగించేలా ఈ నిబంధన తెచ్చారు. అయితే, విద్యాశాఖ పర్యవేక్షణ లోపంతో మెజారిటీ పాఠశాలల్లో గంట మోగడం లేదు. అధికారులు స్పందించి ఈ విధానం అమలయ్యేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News February 7, 2026
ప్రలోభాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం ఆయన పలు చెక్‌పోస్టులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News February 7, 2026
డిండి ఐటీఐలో సోమవారం అప్రెంటిస్ మేళా

డిండి ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా (PMNAM) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9705182677 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News February 7, 2026
నల్గొండ ‘పుర’ పోరు.. గెలుపే లక్ష్యంగా ప్రచారం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈనెల 11న పోలింగ్ జరగనుండగా రెండు రోజుల ముందే ప్రచారానికి తెర పడుతుంది. నల్గొండ జిల్లాలో మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ శక్తిని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచులు, నాయకులు ఎన్నికల్లో కీలక పాత్రధారులుగా మారి అభ్యర్థుల విజయానికి అహర్నిశల శ్రమిస్తున్నారు.


