News February 7, 2026

వైభవ్‌ను అరెస్ట్ చేసి వారిని కాపాడాలని పోస్ట్.. తర్వాత

image

హరారే వేదికగా నిన్న జరిగిన U-19 WC 2026 ఫైనల్‌లో చెలరేగి ఆడిన భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘ఎవరైనా వైభవ్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయండి. గ్రౌండ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై ఈ ఊచకోత ఎక్స్ రేటెడ్’ అని పేర్కొంది. మ్యాచ్‌ జరుగుతుండగా సరదాగా చేసిన ఈ ట్వీట్ SMలో వైరలైంది. WC విజయం అనంతరం టీమ్‌ఇండియా, వైభవ్‌ను అభినందిస్తూ మరో పోస్ట్ పెట్టింది.

Similar News

News February 15, 2026

ఎర్రకోట పేలుళ్లు.. వెలుగులోకి ‘అన్సార్ ఇంటెరిమ్’

image

ఢిల్లీ ఎర్రకోట <<19117415>>పేలుళ్ల కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టయిన ఉగ్రడాక్టర్లంతా ‘అన్సార్ ఇంటెరిమ్’ పేరుతో టెర్రరిస్టు గ్రూపును ఏర్పాటు చేసినట్లు NIA వర్గాలు వెల్లడించాయి. ‘గన్నీ, ఉమర్, ఆదిల్, ముజుఫర్, ఆమిర్, తౌఫిల్ శ్రీనగర్‌లో సమావేశమై దాడులకు ప్లాన్ చేశారు. 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్‌ను కొన్నారు. ఆన్‌లైన్‌లో IEDల తయారీ నేర్చుకున్నారు’ అని తేలింది.

News February 15, 2026

చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News February 15, 2026

పరమ భక్తుడు ‘సిరియాళుడు’

image

సిరియాళుడు ప్రతిరోజు ఓ శివ భక్తుడికి భోజనం పెట్టిన తర్వాతే తను తినేవాడు. ఆయన భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధుడి రూపంలో వచ్చి సిరియాళుడి ఏకైక కుమారుడిని వండి వడ్డించమని అడుగుతాడు. భక్తి కోసం సిరియాళుడు ఆ కఠినమైన పనికి అంగీకరిస్తాడు. ఆ దంపతుల నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు, వారి కుమారుడిని తిరిగి బ్రతికించి, ఆ కుటుంబం మొత్తానికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిస్వార్థ భక్తికి ఆయన నిదర్శనం.