News February 7, 2026

మెదక్: క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి: ఏఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ప్రతి పోలీసు రోజూ వ్యాయామం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, చట్ట వ్యతిరేకులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.

Similar News

News April 19, 2026

మెదక్: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ముగ్గురు కౌన్సిలర్లు

image

మెదక్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సంద్య నవీన్(13వ వార్డు), గౌస్ ఖురేషి(22వ వార్డు), శృతి సంతోష్(23వ వార్డు) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే రోహిత్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

News April 19, 2026

మెదక్ ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్

image

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా 2022 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ నియమితులయ్యారు. ప్రస్తుతం భద్రాచలంలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన మహేందర్ గత నెల 31న రిటైర్ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 19, 2026

మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.