News February 7, 2026

సీఎం సభ.. అన్ని దారులు పరిగి వైపే!

image

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ శివారులో నేడు జరిగే సీఎం బహిరంగ సభకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, VKB, పరిగి, తాండూర్, కొడంగల్, కోస్గి మొయినాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు సుమారుగా 50వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 17, 2026

‘కాళేశ్వరం’పై ఎలాంటి దురుద్దేశమూ లేదు: మంత్రి

image

TG: ₹97,000CRతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలా అని ఆలోచనలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో BRS చేసిన తప్పిదాలు ప్రజలకు తెలుసు. ఈ ప్రాజెక్టుపై మాకెలాంటి దురుద్దేశమూ లేదు. గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తిచేయాలని నిర్ణయించాం’ అని వివరించారు. NDSA ఛైర్మన్‌తో వీటిపై చర్చించామని తెలిపారు.

News April 17, 2026

వరి కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం

image

సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో రబీ సీజన్ వరి కొనుగోలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ప్రతినిధులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు పారదర్శకంగా తూకం వేసి, ప్రతి గింజను కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

News April 17, 2026

బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

image

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్‌ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.