News February 7, 2026

ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

image

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్‌తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

Similar News

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం

image

మేడారంలో రాతి కట్టడం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన బాలుడు యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆమెకు ములుగు కలెక్టరేట్‌లో నియామక పత్రం అందజేశారు. బాలుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ కళ్యాణి పాల్గొన్నారు.

News April 18, 2026

బాపట్ల: యాక్సిడెంట్.. ఇద్దరి స్పాట్ డెడ్ మృతి

image

కారంచేడు మండలం స్వర్ణ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. దగ్గుబాడు నుంచి స్వర్ణ వైపు వస్తున్న ఆటో, స్వర్ణ నుంచి దగ్గుబాటి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.