News February 7, 2026

PGIMER 59పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఛండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ 59 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 16వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, సంబంధిత డిప్లొమా, డిగ్రీ, PG, MBA, BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్ A పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ B, C పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. https://pgimer.edu.in/

Similar News

News April 20, 2026

జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.

News April 20, 2026

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

image

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.