News April 30, 2024
గుంటూరు: బరిలో 162 మంది అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో సోమవారం గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పార్లమెంట్ పోటీలో 30, అసెంబ్లీ స్థానాలైన తాడికొండ 10, మంగళగిరి 40, తెనాలి 13, పొన్నూరు 14, పత్తిపాడు 13, గుంటూరు ఈస్ట్ 14, గుంటూరు వెస్ట్ 28 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 162 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారని చెప్పారు.
Similar News
News October 27, 2025
GNT: మొంథా తుపాన్.. అనిశ్చితితో రైల్వే ప్రయాణికులు

మొంథా తుపాన్ ప్రభావంతో రైల్వే ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. అప్పటికే జిల్లా అధికారులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో గాలి వానల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా, కొన్ని సేవలు రద్దు అయ్యే అవకాశం ఉండటంతో.. ప్రయాణం కొనసాగుతుందా?, లేదా? అన్న అనిశ్చితితో ప్రయాణికులు ఉన్నారు. అయితే రైల్వే అధికారులు మాత్రం తుపాను నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో తీసుకురాలేదు.
News October 27, 2025
GNT: తుపాను సహాయక చర్యలకు రూ. 50 లక్షలు విడుదల

తుపాను సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం సరఫరా చేయడం. వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అవసరమైతే బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.
News October 27, 2025
గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.


